మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్‌పై కామెంట్స్

by  |
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ టీజర్‌పై కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్, హలో, మిస్టర్ మజ్ను’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. తన నెక్స్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అయినా సక్సెస్ అందుకుంటుందా లేదా? అనే ప్రశ్న ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొంది. ఓ వైపు అక్కినేని ఫ్యాన్స్ ఎలాగైనా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటుంటే.. ఇలాంటి ప్రీ టీజర్ రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు పాజిటివ్‌గా ఎలా రీచ్ అవుతుందని ప్రశ్నిస్తూ విమర్శిస్తున్నారు నెటిజన్లు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో అఖిల్‌కు జతగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ టీజర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఇందులో అఖిల్ హర్షగా కనిపిస్తుండగా.. ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50% కెరియర్, 50 % మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. కెరియర్‌ను సూపర్‌గా సెట్ చేసిన హర్షకు.. మ్యారీడ్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియడం లేదు’ అంటూ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ప్రీ టీజర్ యాడ్ లాగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాట్రిమోని అడ్వర్‌టైజ్మెంట్ చూస్తున్నట్లుగా అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దసరా సందర్భంగా అక్టోబర్ 25న రిలీజ్ చేస్తామన్న టీజర్ విషయంలో అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed