మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్‌‌‌టెన్‌లో విజయ్..

by  |
మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్‌‌‌టెన్‌లో విజయ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా’ జాబితాలో మన డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వరుసగా మొదటి, రెండోస్థానంలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు నిలిచారు.

జాబితాలోని టాప్ 10లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మాత్రమే ఉండటం గమనార్హం. మరే తెలుగు హీరో టాప్ 10లో స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండకు సరైన హిట్ రాలేదు. అయినప్పటికీ, ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

Next Story

Most Viewed