- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్ కుంద్రాకు బిగుస్తున్న ఉచ్చు
<p>ముంబై: నీలి చిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. రాజ్ కుంద్రా కంపెనీలో ఉద్యోగం చేసే నలుగురు ఉద్యోగులు సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చినట్టు ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇప్పటివరకు పోర్నోగ్రఫీలో కేసులో రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా పలు ఆధారాలు సేకరించిన పోలీసులకు ఈ ఉద్యోగులు ఇచ్చే సమాచారం మరింత కీలకంగా మారనున్నది. వీరి వద్ద నుంచి రాజ్ కుంద్రాకు సంబంధించిన వ్యాపారం, […]</p>

ముంబై: నీలి చిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. రాజ్ కుంద్రా కంపెనీలో ఉద్యోగం చేసే నలుగురు ఉద్యోగులు సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చినట్టు ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇప్పటివరకు పోర్నోగ్రఫీలో కేసులో రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా పలు ఆధారాలు సేకరించిన పోలీసులకు ఈ ఉద్యోగులు ఇచ్చే సమాచారం మరింత కీలకంగా మారనున్నది. వీరి వద్ద నుంచి రాజ్ కుంద్రాకు సంబంధించిన వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, పోర్నోగ్రఫీకి సంబంధించిన వివరాలు సేకరించనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
సాక్ష్యుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు త్వరలోనే రికార్డు చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ముంబై అంధేరీలోని రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ కంపెనీలో పోలీసులు శనివారం మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆఫీస్‌లో దాచి ఉంచిన ఓ లాకర్‌ను సీజ్ చేశారు. ఈ లాకర్‌లో వ్యాపారం, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన కీలక పత్రాలు లభించాయి. వీటిని ముంబై క్రైం బ్రాంచ్ పరిశీలిస్తున్నది. కాగా, పోర్నోగ్రఫీ కంటెంట్‌ను చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల 19న రాజ్ కుంద్రా అరెస్టయిన విషయం తెలిసిందే.






