అమెరికాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

by  |
అమెరికాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా
X

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,172 మంది వైరస్ రక్కసి ధాటికి బలైయ్యారు. అంతకు ముందు రోజు కేవలం 1738 మరణాలు మాత్రమే సంభవించాయి. తాజా మరణాలతో అమెరికా వ్యాప్తంగా మరణాల సంఖ్య 50 వేలు ధాటింది. వైరస్ బాధితుల సంఖ్య 9 లక్షలు ధాటింది. న్యూయార్క్ నగరంలో సెప్టెంబర్ కల్లా సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని మేయర్ బిల్ డి బ్లాసియో ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలోనే 2.63 లక్షలు పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో సగం న్యూయార్క్ నగరంలోనే నమోదయ్యాయి.

టర్కీలోనూ కరోనా విస్తృతి పెరుగుతోంది. రాజధాని ఇస్తాంబుల్‌ను మరో వుహాన్ అని అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెత్తిన్ కొకా అభివర్ణించారు. టర్కీలో ఇప్పటి వరకు 1.04 లక్షల మంది వైరస్ బారిన పడగా, 2,600 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక కేసులు ఇస్తాంబుల్‌లోనే నమోదయ్యాయి. స్పెయిన్‌లో కరోనా ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 367 మరణాలు సంభవించాయి. ఒక్క రోజులో ఇంత తక్కువ స్థాయిలో మరణాల సంఖ్య నమోదు కావడం గత నెల 22 తరువాత ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.

Tags: carona, USA, Turkey, spain, positive cases, deaths

Next Story

Most Viewed