స్పుత్నిక్-వీ టీకాపై రెడ్డీస్ ల్యాబ్ కీలక ప్రకటన 

by  |
Sputnik-V
X

దిశ, వెబ్‌డెస్క్ : స్పుత్నిక్‌-వీ టీకా అందుబాటులోకి రావడం ఆలస్యం కానుంది. మరో రెండు వారాల సమయం పట్టనున్నట్టు రెడ్డీస్‌ల్యాబ్‌ వర్గాలు తెలిపాయి. 50 లక్షల డోసులకు గానూ ఇప్పటికే సుమారు 30 లక్షల డోసులు రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైనా.. బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. టీకాలను పరీక్షల నిమిత్తం కసౌలిలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబోరేటరీ (సీడీఎల్‌)కి పంపించారు. వీటికి సంబంధించిన అనుమతులు ఇంకా రాలేదని అందువల్లే టీకాల విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు రెడ్డీస్ ల్యాబ్ వర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed