చంద్రబాబు చేతిలో రఘురామ ఓ కీలు బొమ్మ

by  |
AP-LEADER
X

దిశ, ఏపీ బ్యూరో : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మతో గెలిచిన రఘురామ… నైతిక విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన పార్లమెంట్‌లో అడుగుపెట్టారని అలాంటి ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. ఎంపీ రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని విరుచుకుపడ్డారు. ప్రజాభిమానాన్ని కోల్పోయిన ఆయన మీడియా ద్వారా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికైనా ఎంపీ రఘురామ తన వైఖరి మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎంపీ రఘురామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొంది ఆ పార్టీకే విపక్ష నేతగా మారారు. వైసీపీ అధినేత సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కూడా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు ఇప్పటికే పూర్తవ్వగా సెప్టెంబర్15న తుది తీర్పు వెలువడనుంది.

Next Story

Most Viewed