గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వినూత్న ప్రచారం

by prasad |
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వినూత్న ప్రచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో:వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లల్లో గెలుపు కోసం పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గెలుపుకోసం ఫ్లాష్ మాబ్ డ్యాన్సులతో బీఆర్ఎస్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంటోంది. వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లలో యువతీ యువకులు ప్లాష్ మాబ్ డాన్సులకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కొత్త తరహా ప్రచారం స్థానికులను ఆకట్టుకుంటోంది. కాగా మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం ఈ తరహా ప్లాష్ మాబ్ ప్రచారం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.

Next Story

Most Viewed