భయానకం : పామును న్యూడిల్స్‌లా తినేసిన గుడ్లగూబ.. వీడియో వైరల్!

by Samataha |
భయానకం : పామును న్యూడిల్స్‌లా తినేసిన గుడ్లగూబ.. వీడియో వైరల్!
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక మనం ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఇట్టే తెలుసుకుంటున్నాం. ఇక సోషల్ మీడియాల వచ్చే కొన్ని వీడియోలు చూస్తే నిజమా? ఇది నిజంగా జరిగిందా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుడ్లగూబ గురించి అందరికీ తెలిసిందే. ఇది చూడటానికి కాస్త భయంకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఏదైనా శుభకార్యానికి వెళ్లినప్పుడు ఇది ఎదురు వస్తే అశుభంగా భావిస్తారు మన పెద్దవారు.

అయితే గుడ్ల గూబ కీటకలను తింటూ ఉంటుంది. కానీ అది వాటిని తినేటప్పుడు ఎవరూ ఎక్కువగా చూడరు. కానీ అది పాను కూడా తింటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో గుడ్లగూబ రక్త పింజర పామును న్యూడిల్స్ లా తినేసింది. మొదట్లో తల వరకు చాలా మెల్లిగా తిన్న గుడ్లగూబ తర్వాత పామును కరకరా నమిలి మింగేసింది. అయితే ఆ పాము మాత్రం దానిని కాటు వేయడానికి ప్రయత్నించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. వామ్మో గుడ్ల గూబ ఏంటీ అంత ఘోరంగా ఉంది. దానిని అలా తింటున్నా.. ఆ పాము ఎందుకు కాటు వేయడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓ నెటిజన్ మాత్రం.. వామ్మో.. ఈ దృశ్యం భయానకంగా ఉంది.. పామును అరిగించుకోవడానికి దానికి ఎంత టైం పడుతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed