బేబీ బంప్ తో క్యాట్ వాక్ చేసిన హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోస్!

by Samataha |
బేబీ బంప్ తో క్యాట్ వాక్ చేసిన హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోస్!
X

దిశ, సినిమా : హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ప్రేమ ఖైదీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో కలిసి లవ్ ఫెయిల్యూర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే ఈమె గర్భం దాల్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమలాపాల్ మొదట తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత జగత్‌ దేశాయ్‌ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన భర్తతో దిగిన ఫోటోలు ఎప్పుడూ షేర్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అంటూ బేబీ బంప్ ఫోటోస్ సఏర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నటి మరోసారి బార్బీ గర్ల్ డ్రెస్సులో బేబీ బంప్‌తో ర్యాంప్ వాక్ పై క్యాట్ వాక్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో అమలాపాల్ తన అంద చందాలు చూపిస్తూ .. అమ్ము కాబోతున్నాను అనే ఫీలింగ్ చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆ ఫీలింగ్‌ను అందరితో షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed