రోజుకొక బాతు గుడ్డు తింటే.. ఆ అనారోగ్య సమస్యలు పరార్ ..!

by Prasanna |
రోజుకొక బాతు గుడ్డు తింటే.. ఆ అనారోగ్య సమస్యలు పరార్ ..!
X

దిశ, ఫీచర్స్: బాతు గుడ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. బాతు గుడ్లు కోడి గుడ్లకు ఏ మాత్రం తీసిపోవు. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్ , సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కోడి గుడ్ల కంటే బాతు గుడ్లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి. కొంతమందికి బాతు గుడ్లు సులభంగా జీర్ణమవుతాయి. మీ ఆహారంలో బాతు గుడ్లను చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకొక బాతు గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..

బాతు గుడ్లలో ఉండే కెరోటినాయిడ్స్, అమైనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ నివారణకు బాతు గుడ్లను ముఖ్యమైన ఆహారంగా ఉపయోగించవచ్చు.

డీసాల్టెడ్ బాతు గుడ్డులోని తెల్లసొన కోడి గుడ్ల కంటే కాల్షియంను బాగా గ్రహిస్తుంది. బరువు నియంత్రణతో పాటు, బాతు గుడ్లు కండరాల ఆరోగ్యాన్ని , బలాన్ని ప్రోత్సహిస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత బాతు గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story

Most Viewed