- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైఎస్సార్ మరణంపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం చాలా దుర్మార్గమన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తుంటే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంలో కూడా ఆయన కుట్ర ఉందేమోనన్న అనుమానాలు బలపడేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని గుర్తుచేశారు. ఏ ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్‌పై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ డిమాండ్ చేశారు.
Next Story