ఎలక్ట్రిక్ వైర్లపై కోతుల విన్యాసం.. హిలేరియస్ వీడియో

by  |
ఎలక్ట్రిక్ వైర్లపై కోతుల విన్యాసం.. హిలేరియస్ వీడియో
X

దిశ, ఫీచర్స్ : మానవుడు మొదట హోమోసెఫియన్‌గా ఉండేవాడని, కాలక్రమంలో కోతి నుంచి మానవుడిగా రూపాంతరం చెందాడని సైన్స్ పాఠాల్లో చదువుకున్నాం. ఈ మేరకు ఇప్పటికీ మనుషుల్లో కొన్ని కోతి లక్షణాలను గమనిస్తూనే ఉంటాం. ఎవరైనా హైపర్ యాక్టివ్‌గా ఉంటే ‘నువ్వు కోతిలా ఉన్నావ్..’ అనే మాటల్ని వింటూనే ఉంటాం. కాగా వెర్రితో దుంకులాడిన కోతుల వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

బెంగళూరులోని ఓ అపార్టుమెంట్‌పై నుంచి కోతులు ఒకదాని తర్వాత ఒకటి ఎలక్ట్రిక్ వైర్ల మీదుగా జారుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మొదట ఒక కోతి మాత్రమే వైర్ మీద నుంచి జారగా, దాన్ని చూసిన మిగతా కోతులు అదే విధంగా జారుతూ వచ్చాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాఫింగ్ ఎమోజీలు షేర్ చేస్తూ ‘పవన పుత్ర హనుమాన్’ అని పోస్టులు పెడుతున్నారు. మంకీలు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నాయని, సదరు అపార్ట్‌మెంట్‌వాసులు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed