మనీహీస్ట్ పాటకు మరాఠి వెర్షన్.. వ్యాక్సిన్‌పై వినూత్న అవగాహన..

by  |
money-heist
X

దిశ, ఫీచర్స్ : ఛత్తీస్‌గఢ్‌, సుక్మా జిల్లా చిన్నోడు హసదేవ్‌ డిర్డో.. తన పాఠశాలలో పాడిన ‘బచ్‌పన్ కా ప్యార్ హై’ పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌ కావడంతో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ తో పాటు అనుష్క శర్మ, మరికొంతమంది సెలబ్రిటీలు ఆ పిల్లోడిని ప్రశంసించారు. తాజాగా వరల్డ్ పాపులర్ సిరీస్ ‘మనీ హీస్ట్’ నుంచి ‘బెల్లా సియావో’ సాంగ్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక మహారాష్ట్రకు చెందిన ఓ మ్యూజిక్ ట్రూప్.. వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు మనీహీస్ట్ థీమ్‌సాంగ్‌ను ఉపయోగించుకుంది.

marathi

ఇప్పటికీ కొవిడ్ -19 భయాలున్నా, ప్రికాషన్స్ పాటించడానికి లేదా టీకాలు వేసుకోవడానికి సంకోచిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే ‘మనీ హీస్ట్’ సాంగ్ క్రేజ్‌ను ఉపయోగించుకుని మహారాష్ట్రకు చెందిన ‘ఖాస్ రే సంగీత్’ అనే బ్యాండ్ ట్రూప్.. ప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు మరాఠీ వెర్షన్‌ పాటను అందించింది. కళాకారులు రెడ్ జంప్‌ సూట్స్‌తో పాటు సాల్వడార్ డాలీ మాస్క్‌లు ధరించి వీధుల్లో ప్రదర్శనలిస్తూ టీకాలు వేయించుకోవాలని ప్రజల్ని కోరారు. ‘లాస్ ఘ్యా లాస్ ఘ్యా’ అనే వాక్యాలతో మొదలయ్యే ఈ పాట.. రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతుంది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండటంతో మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. మనీహీస్ట్ థీమ్ సాంగ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ సాధించగా, ముంబై పోలీసులు కూడా తమ బ్యాండ్‌తో ఈ పాట పాడిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed