బ్రెయిన్ డెడ్‌తో మాలీవుడ్ డైరెక్టర్ మృతి

by  |
బ్రెయిన్ డెడ్‌తో మాలీవుడ్ డైరెక్టర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మాలీవుడ్ ఇండస్ట్రీ మరో షాకింగ్ న్యూస్‌తో దిగ్భ్రాంతికి గురైంది. ‘సోఫియుమ్ సుజాతయుమ్’ డైరెక్టర్ నరనిపుజ శనవస్ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లు ప్రకటించడంతో షాక్‌కు గురయ్యారు. అనారోగ్యంతోనే నెక్స్ట్ సినిమా షూటింగ్ చేస్తున్న ఆయన సోమవారం కార్డియోజెనిక్ షాక్‌కు గురయ్యారు.

మూవీ యూనిట్, కుటుంబ సభ్యులు ఆయనను కొయంబత్తూరులోని కేజీ హాస్పిటల్‌లో చేర్పించగా బ్రెయిన్ డెడ్ అయి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ప్రకటించారు వైద్యులు. కాగా ఐదేళ్ల క్రితం ‘కారి’ సినిమాతో డెరెక్టర్‌గా మారిన నరనిపుజ శనవస్..తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. లేటెస్ట్‌గా అదితిరావు హైదరీ నటించిన ‘సోఫియుమ్ సుజాతయుమ్’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ టాక్ తెచ్చుకుంది.


Next Story

Most Viewed