ఇదెక్కడి విడ్డూరం.. ఇంకా రిలీజ్ కూడా కానీ సినిమాకు నేషనల్ అవార్డా?

by Shyam |   (  Updated:2021-03-22 23:10:54  IST  )

<p>దిశ,వెబ్ డెస్క్: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.కరోనా కారణంగా ఈ అవార్దుల ప్రధానోత్సవం ఒక ఏడాది వాయిదా పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తాజాగా అవార్డుల ప్రధానోత్సవాన్ని మొదలుపెడుతూ కేంద్రం అవార్డు విన్నర్స్ ని ప్రకటించింది. తెలుగులో మహేష్‌ బాబు నటించిన &#8216;మహర్షి&#8217; చిత్రానికి మూడు, నాని నిటించిన &#8216;జెర్సీ&#8217; చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ అవార్డుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. [&hellip;]</p>

ఇదెక్కడి విడ్డూరం.. ఇంకా రిలీజ్ కూడా కానీ సినిమాకు నేషనల్ అవార్డా?
X

దిశ,వెబ్ డెస్క్: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.కరోనా కారణంగా ఈ అవార్దుల ప్రధానోత్సవం ఒక ఏడాది వాయిదా పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తాజాగా అవార్డుల ప్రధానోత్సవాన్ని మొదలుపెడుతూ కేంద్రం అవార్డు విన్నర్స్ ని ప్రకటించింది. తెలుగులో మహేష్‌ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రానికి మూడు, నాని నిటించిన ‘జెర్సీ’ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ అవార్డుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. అసలు సినిమా విడుదల కాకముందే ఒక మలయాళ సినిమాకు మూడు అవార్డులు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్‌’ చిత్రానికి గానూ ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, కాస్ట్యూమ్స్‌ కేటగిరీల్లో అవార్డు ప్రకటించారు. ఈ సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకున్నా కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమయింది. ఈ నేపథ్యంలో విడుదల కానీ ఒక సినిమాకు మూడు కేటగిరిలో అవార్డులు ఇవ్వడం ఏంటి? అని అందరు నివ్వెర పోతున్నారు. గత ఏడాదే సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. కాగా ఈ సినిమా మే 19 న విడుదలకు సిద్దమవుతుంది.

Next Story