నన్ను రెచ్చగొట్టొద్దు.. నేను ఎవరికీ భయపడను : మోహన్ బాబు

by  |

దిశ, వెబ్ డెస్క్ : మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి సిద్దం అయ్యాడు. ఈ సందర్భంగా హాజరైన మోహన్ బాబు మాట్లాడుతూ తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని అని అన్నారు. ఇండస్ట్రీ లో ఎదగాలంటే టాలెంట్ మాత్రం ఉంటే చాలని ఎవరి అండదండలు అవసరం లేదని అన్నారు. ఇక్కడ నేను గొప్పా , నువ్వు గొప్పా అన్నది ముఖ్యం కాదు, ఎవరు ఏం చేస్తారన్నదే ముఖ్యం అన్నారు. ఇండస్ట్రీలో బెదిరింపులకు ఏ కళాకారుడు భయపడాల్సిన పని లేదని అండగా ఉంటామన్నారు. మనం కళాకారుల గురించి మాట్లాడాలి కానీ, ఇలా రాజకీయాల గురించి కాదని అన్నాడు. రాజకీయాల్లో కంటే టాలీవుడ్ లో పాలిటిక్స్ ఎక్కువయ్యాయని విమర్శించాడు. టాలెంట్ ఎవడి సొత్తూ కాదని కష్టపడే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Next Story