ప్రతి జన్మలోనూ నువ్వే కూతురిగా పుట్టాలి : మోహన్ బాబు

by  |
ప్రతి జన్మలోనూ నువ్వే కూతురిగా పుట్టాలి : మోహన్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్: మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఫ్యాన్స్. మల్టీ టాలెంటెడ్ లక్ష్మి లైఫ్‌లో మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కూతురికి విష్ చేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

లక్ష్మిని ఎత్తుకుని ఉన్న చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన మోహన్ బాబు.. ‘వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం’ లాంటి కుమార్తె సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు కానీ, ఉంటే మాత్రం లక్ష్మీ ప్రసన్న తనకు కూతురిగా పుట్టాలని.. నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాలను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మి మంచు’ అని విష్ చేశారు. తన కూతురు అమూల్యమైన నిధి అని కొనియాడారు మోహన్ బాబు.

Next Story