- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్‌కి చురకలంటించిన మోహన్‌బాబు.. నన్నే లాగుతావా!
<p>దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై హీరో మోహన్ బాబు స్పందించారు. తన చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్.. తన కంటే చిన్నవాడని, అందుకని ఏకవచనంతో సంబోధిస్తున్నానని పేర్కొన్నారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావు అందుకు సంతోషమే అన్నారు. కానీ, ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో నా కుమారుడు ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడని నీకు తెలుసు అని గుర్తు చేశారు. ఎన్నికలు అయిపోయిన […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై హీరో మోహన్ బాబు స్పందించారు. తన చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్.. తన కంటే చిన్నవాడని, అందుకని ఏకవచనంతో సంబోధిస్తున్నానని పేర్కొన్నారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావు అందుకు సంతోషమే అన్నారు. కానీ, ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో నా కుమారుడు ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడని నీకు తెలుసు అని గుర్తు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నీవు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని సింపుల్‌గా పవన్‌కి చురకలు అంటించారు. ఈలోగా పవన్ నువ్వు చేయవలసిన ఓ ముఖ్యమైన పని ఉంది, మా ఎన్నికల్లో నీ సోదర సమానుడైన విష్ణు బాబుకి ఓటేయాలని కోరారు. విష్ణు ప్యానల్‌కి ఓటు వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాని మోహన్ బాబు పేర్కొన్నారు . ఈ మేరకు తన ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
To My Dear @PawanKalyan pic.twitter.com/xj1azU3v8B
— Mohan Babu M (@themohanbabu) September 26, 2021






