ఒలింపిక్స్ అంటే నాకు మిల్కా సింగే గుర్తొస్తున్నాడు : మోడీ

109

దిశ,వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ త్వర‌లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ క్రీడల గురించి మాట్లాడుతూ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యలో మోడీ ఫ్లయింగ్ సిఖ్‌గా పేరుగాంచిన పరుగల వీరుడు మిల్కా సింగ్‌ను మోదీ గుర్తుచేసుకున్నారు. ఒలింపిక్స్ అంటే నాకు మిల్కా సింగే గుర్తొస్తున్నాడని,  క్రీడ‌ల‌కే త‌నజీవితాన్ని అంకితమిస్తూ మిల్కా స్ఫూర్తిదాయ‌కంగా నిలిచార‌ని కొనియాడారు.

అలాగే కరోనాపై కలసికట్టుగా పోరాడాలని ప్రధాని మోడీ మన్ ‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనాతో దేశ ప్రజల పోరాటం కొనసాగుతోంది, అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. వ్యాక్సిన్ తిరస్కరించడం చాలా ప్రమాదకంరం అని తెలిపారు. మనకి కరోనా వస్తే మన కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు కూడా ప్రమాదం కాబట్టి అందరూ వ్యాక్సిన్లపై భయాన్ని వదులుకోవాని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే కొందరికి కొంత సమయం సాధారణ జ్వరం, ఓళ్లు నొప్పులు ఉంటాయి దానికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..