- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.10 కి 4 ఇడ్లీలు… బీజేపీ కొత్త ఆఫర్!!
<p>దిశ, వెబ్ డెస్క్: బాబోయ్ ఇడ్లీలు పదికి నాలుగంట..! అది కూడా సాంబారుతో… భలే మంచి ఆఫర్. లేకపోతే కరోనా దెబ్బకి కొండెక్కి కూర్చున్న రేట్లలో ఇంత తక్కువ ధరకి 4 ఇడ్లీ అంటే మాటలా..? అసలు వివరాల్లోకి వెళితే… తమిళనాడులో మోడీ ఇడ్లీలు రూ.10కి నాలుగు చొప్పున మరికొన్ని రోజుల్లో ప్రజల అందుబాటులోకి తీకొస్తున్నట్లు పోస్టర్లు రెడీ అయ్యాయి. తమిళనాడు బీజేపీ ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ ఐడియా ఇది. ఈ పథకంపై భారీగా ప్రచారం […]</p>

దిశ, వెబ్ డెస్క్: బాబోయ్ ఇడ్లీలు పదికి నాలుగంట..! అది కూడా సాంబారుతో… భలే మంచి ఆఫర్. లేకపోతే కరోనా దెబ్బకి కొండెక్కి కూర్చున్న రేట్లలో ఇంత తక్కువ ధరకి 4 ఇడ్లీ అంటే మాటలా..? అసలు వివరాల్లోకి వెళితే… తమిళనాడులో మోడీ ఇడ్లీలు రూ.10కి నాలుగు చొప్పున మరికొన్ని రోజుల్లో ప్రజల అందుబాటులోకి తీకొస్తున్నట్లు పోస్టర్లు రెడీ అయ్యాయి.
తమిళనాడు బీజేపీ ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ ఐడియా ఇది. ఈ పథకంపై భారీగా ప్రచారం జరుగుతోంది. పోస్టర్లు, కూపన్ల ద్వారా ప్రజలోకి తీసుకెళ్తున్నారు. ఈ ఆఫర్‌ను ముందుగా 22 దుకాణాల ద్వారా అందుబాటులోకి తీసుకు రావాలని సన్నద్ధం చేస్తున్నారు. సక్సెస్ అయితే అన్నిచోట్లా ఏర్పాటు చేస్తామంటున్నారు మహేష్.
ఈ పోస్టర్ డిజైనింగ్ లో ఒకవైపు మోడీ, మరోవైపు మహేష్ ఫోటోలు వేసి… మధ్యలో ఇడ్లీ, సాంబార్ ఫోటో పెట్టి తమిళంలో ఆఫర్ గురించి రాశారు. మరి ఈ మోడీ ఇడ్లీలను ప్రజలు ఎంతవరకు ఇష్టపడతారో వేచి చూడాలి. మనలో మాట ఇడ్లీలకి ఓట్లు రాలతాయంటారా…? ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి… అంతేగా!!
https://twitter.com/Mahesh10816/status/1299619738604068865?s=20






