మొబైల్ ఛార్జింగ్ పెడితే కరెంట్‌ను దొంగిలించినట్టేనట!

by  |
Mobile charging
X

దిశ, డైనమిక్ బ్యూరో : పనిచేసే సమయంలో మొబైల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఓ అధికారి చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. ఆఫీసులో పనిచేసే సమయంలో ఉద్యోగులు మొబైల్‌ను అధికంగా వినియోగిస్తు్న్నారని గుర్తించి.. తరచూ యూజ్ చేయొద్దని ఆ అధికారి ఆదేశించాడు. బాస్ మాటలను పట్టించుకోని ఉద్యోగులు ఆఫీసులోనే ఛార్జింగ్ పెట్టుకుని మొబైల్ వినియోగిస్తున్నారు. దీన్ని మరింత సీరియస్ గా తీసుకున్న అధికారి ఆఫీసులోని గోడలపై నోటీస్ అంటించారు.

అందులో ఇలా ఉంది… ‘‘ఈ ఆఫీసులో ఎవరూ వారి మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టకూడదు. అలా చేస్తే విద్యుత్‌ను దొంగలించినట్టే. అలాంటి వారిని గుర్తించి వారి జీతం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేస్తాం. ఆఫీసు స్టాఫ్ అంతా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలని’’ ఆ నోటీస్‌లో ఆదేశించారు. దీనిని ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Notice



Next Story