- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే అనుచరులమంటూ పెద్ద స్కెచ్
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలోని నూజివీడులో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అనుచరులమంటూ భూకబ్జా చేసేందుకు స్కెచ్ వేశారు. కానీ వారి ప్రయత్నం బెడిసిగొట్టింది. రైతులు అడ్డుకోవడంతో వారి కథ అడ్డం తిరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు మండలం గొడుగువారిగూడెం వద్ద 27 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని 1983 నుండి రైతుల సాగు చేసుకుంటున్నారు. […]</p>

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలోని నూజివీడులో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అనుచరులమంటూ భూకబ్జా చేసేందుకు స్కెచ్ వేశారు. కానీ వారి ప్రయత్నం బెడిసిగొట్టింది. రైతులు అడ్డుకోవడంతో వారి కథ అడ్డం తిరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు మండలం గొడుగువారిగూడెం వద్ద 27 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని 1983 నుండి రైతుల సాగు చేసుకుంటున్నారు.

అయితే వారసత్వ సంపద కింద ఈ భూమిపై తమకు హక్కు ఉందంటూ వేరే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు దానిని కొట్టేసే ప్రయత్నం చేశారు. భూమిలోకి వచ్చి రైతులతో గొడవకు దిగారు. దీంతో రైతులు వారిని అడ్డుకున్నారు. భూమికి సంబంధించి పూర్తి హక్కులు తమకే ఉన్నాయని రైతులు తేల్చి చెప్పారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా తమ భూమిని కబ్జా చేసేందుకు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు వర్గీయులు, వారసులు ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. భూములను ఆక్రమించేందుకు వచ్చిన కాకుమాను స్రవంతి దేవి, మొవ్వ వెంకటేశ్వరరావుల వద్ద ఎలాంటి రికార్డులు లేవని, అయినప్పటికీ దౌర్జన్యానికి దిగుతున్నారని రైతులు మండి పడుతున్నారు. వీరికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని రైతులు వాపోతున్నారు. తమకి అన్యాయం చేయొద్దంటూ వేడుకుంటున్నారు.






