- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఐజీ తెలిపిన వివరాల ప్రకారం…. గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపాల్, హిర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో పోలీసులకు మావోయిస్టులు తారస పడి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు […]</p>

దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఐజీ తెలిపిన వివరాల ప్రకారం…. గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపాల్, హిర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో పోలీసులకు మావోయిస్టులు తారస పడి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఆ ప్రదేశంలో ఒక మావోయిస్టు మృతదేహం, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాగా తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు ఐజీ తెలిపారు. గడిచిన మూడు రోజుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు నడుమ నాలుగు సార్లు ఎదురుకాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. ఆ ఘటనల నుంచి మావోయిస్టులు తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు.






