బిగ్ బ్రేకింగ్: కౌశిక్‌రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్

426

దిశ, తెలంగాణ బ్యూరో : నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ సిఫార్సు చేసింది. ఆమోదం పొందగానే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఇది ఇలా ఉంటే జూలై21న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మంచి పదవి ఇస్తానని..చాలా భవిష్యత్ ఉందని..ప్రకటించిన విధంగానే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం ఖాయమైంది. తెలంగాణ భవిష్యత్ యువతదేనని…అందుకు పార్టీలో పెద్దపీట వేస్తామని చెప్పిన మాట ప్రకారం పదవిని కట్టబెడుతున్నట్లు సంకేతమిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 61,121ఓట్లు సాధించారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో మంచి పట్టుఉండటం, యువత అభిమానం చూరగొన్నాడు. అంతేగాకుండా కౌశిక్ రెడ్డి కుటుంబంతో కేసీఆర్ కు సన్నిహిత సత్సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు ఉండటం, తెలంగాణ ఉద్యమసమయంలో కౌశిక్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డితో అనుబంధం కూడా ఎమ్మెల్సీ పదవి రావడానికి మరోకారణం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..