- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే వీరయ్య, నాయిని నారాజ్‌లో ఉన్నారు: వీహెచ్
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: రాహుల్ గాంధీ తిరిగి ఏఐసిసి అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ కోరారు. రాహుల్ గాంధీ బర్త్‌డేను పురస్కరించుకొని అంబర్‌పేటలో పేదలకు, పారిశుధ్య సిబ్బందికి వీహెచ్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు తమకు గౌరవం లేదన్న భావనలో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే పొడెం వీరయ్య, నాయిని రాజేందర్ రెడ్డి నారాజ్‌లో ఉన్నారని చెప్పారు. తాను, దామోదర రాజనర్సింహ వారితో […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: రాహుల్ గాంధీ తిరిగి ఏఐసిసి అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ కోరారు. రాహుల్ గాంధీ బర్త్‌డేను పురస్కరించుకొని అంబర్‌పేటలో పేదలకు, పారిశుధ్య సిబ్బందికి వీహెచ్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు తమకు గౌరవం లేదన్న భావనలో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే పొడెం వీరయ్య, నాయిని రాజేందర్ రెడ్డి నారాజ్‌లో ఉన్నారని చెప్పారు. తాను, దామోదర రాజనర్సింహ వారితో మాట్లాడామని, ఎలాంటి తొందర పాటు నిర్ణయం తీసుకోవొద్దని సూచించినట్లు చెప్పారు. ముప్పై నియోజక వర్గాలకు ఇన్‌ఛార్జీలు కూడా లేరని.. వెంటనే నియమించాలని తెలిపారు. అందుకోసం కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కుంతీయను కోరినట్లు వీహెచ్ పేర్కొన్నారు.
Next Story






