మహిళలపై నోరు పారేసుకున్న తాటికొండ రాజయ్య.. దిష్టిబొమ్మ దహనం

by  |
మహిళలపై నోరు పారేసుకున్న తాటికొండ రాజయ్య.. దిష్టిబొమ్మ దహనం
X

దిశ, జఫర్‌గడ్ : బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒక ఎమ్మెల్యే మరీ ఇంత దిగజారి అజ్ఞానంగా మాట్లాడటం ఎక్కడా చూడలేదని తీవ్రంగా మండిపడ్డారు.

రాజయ్య బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ జడ్పీటీసీ పట్టపూరి సదయ్య, ఇల్లందుల బాబు, మామిడాల మధు, దానియల్, మంచాల కొమురయ్య పాల్గొన్నారు.



Next Story