ఎమ్మెల్యే రాజయ్య వేలు ఆమె నోట్లో.. (వీడియో)

by  |
MLA Rajaiah
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆదివారం జరిగిన బతుకమ్మ చీరల పంపిణీలో సీఎం కేసీఆర్ అందరికీ భర్త అంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపాయి. ఇది చాలదన్నట్లు తాజాగా ఆయన చేసిన పనికి మరోసారి వార్తల్లోకెక్కారు.

నియోజకవర్గంలో ఒకరి బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య చాటుగా చేసిన లీలలు కెమెరా కంటికి చిక్కాయి. బర్త్ డే కేక్ కట్ చేసి కార్యకర్తకు తినిపించిన రాజయ్య ఓ వ్యక్తి వెనక నుంచి చెయ్యి వేసి పక్కనే ఉన్న ఓ మహిళను గిల్లుతూ.. ఆమె నోట్లో వేలు పెడుతూ.. వీడియోకి చిక్కాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినప్పటికి బతుకమ్మ చీరల పంపిణీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రాజయ్య లీలలు అన్నీ ఇన్నీ కావయా అంటూ వ్యంగస్త్రాలు విసురుతున్నారు.



Next Story