- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే సీతక్క హౌస్ అరెస్ట్
by Shyam |
<p>దిశ, వరంగల్: ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క పోలీసుల వైఖరికి నిరసనగా క్యాంప్ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలాపునే గోదావరి ఉన్న త్రాగటానికి నీళ్ళు లేవని, ములుగు నియోజకవర్గం గుండా గోదావరి జలాలు సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమని, దీనికి […]</p>

X
దిశ, వరంగల్: ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క పోలీసుల వైఖరికి నిరసనగా క్యాంప్ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలాపునే గోదావరి ఉన్న త్రాగటానికి నీళ్ళు లేవని, ములుగు నియోజకవర్గం గుండా గోదావరి జలాలు సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమని, దీనికి నిరసనగా టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన జల దీక్షను అడ్డుకోవడం ముఖ్యమంత్రికి తగదన్నారు. అక్రమ అరెస్ట్ లతో దీక్షను అడ్డుకోలేరని ఆమె ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Next Story






