‘దిశ’కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది: సంజయ్ కుమార్

126

దిశ,జగిత్యాల: దిశ దినపత్రిక అనతికాలంలోనే ప్రజల మన్ననలు పొందిందని, ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దిశ దినపత్రిక 2021 క్యాలెండర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…”దిశ” పత్రిక సంపాదకులకు, యజమానికి, పాత్రికేయ మిత్రులకు జగిత్యాల ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పత్రికలో ప్రముఖ సంపాదకులు, పాత్రికేయులు ఉన్నారని తెలిపారు. ప్రజల ఆదరణ పొంది, దినదినాభివృద్ది చెందాలనీ జగిత్యాల ప్రజల పక్షాన కోరుకుంటున్నామని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలిసే విధంగా, ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పనులు ప్రజలకు తెలిసే విధంగా పత్రికలు పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ చేటిపెల్లి సుధాకర్, ఎండీ జహీరుద్దీన్, బండ్లమూడి రామ్ ప్రసాద్, అజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..