- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలరోజులు నడవకూడదు.. వీడియో విడుదల చేసిన రోజా
<p>దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇటీవల చెన్నైలో శస్త్రచికిత్సలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆమె తాజాగా వీడియోను విడుదల చేశారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా నెలరోజులు నడవకూడదని, అందుకే ప్రచారానికి రాలేకపోయానని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కరూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులను భారీ […]</p>

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇటీవల చెన్నైలో శస్త్రచికిత్సలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆమె తాజాగా వీడియోను విడుదల చేశారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా నెలరోజులు నడవకూడదని, అందుకే ప్రచారానికి రాలేకపోయానని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కరూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోందని రోజా వ్యక్తం చేశారు. అలాగే తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా తనకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు అంటూ రోజా పేర్కొన్నారు.






