- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telangana Assembly Election 2023
- 2023 Cricket World Cup

దిశ ఖానాపూర్: తెలంగాణ రాష్ట్రం లో ఆడ బిడ్డలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న గా నిల్చాడని ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం లోని ఖానాపూర్, పెంబి, కడం, ఉట్నూర్ మండలాల లోని పలు గ్రామాల్లో బుధవారం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఖానాపూర్ మండలం లోని తర్లపాడు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ అని గుర్తించి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది గోదావరి నర్సయ్య , ఉప్పసర్పంచ్ రామిడి మహేష్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,మార్కెట్ చెర్మాన్ పుప్పాల శంకర్, తెరాస మండల అధ్యక్షుడు రాజగంగన్న, నాయకులు ఆకుల వెంకగౌడ్,ప్రదీప్, శనిగారపు శ్రవణ్, ఇప్ప సంతోష్, పెద్ది మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.