- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రైతులు అధైర్య పడొద్దు’
<p>దిశ, ఖమ్మం: పంట కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ అధైర్య పడొద్దని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు భరోసా ఇచ్చారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా వల్ల రైతాంగానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, అధైర్య పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి […]</p>

దిశ, ఖమ్మం: పంట కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ అధైర్య పడొద్దని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు భరోసా ఇచ్చారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా వల్ల రైతాంగానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, అధైర్య పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, సర్పంచ్ సిరిపురపు స్వప్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, సుబ్రహ్మణ్యం, రైతులు పాల్గొన్నారు.
tags: burgampadu, rega kantha rao, MLA, crop buy centre, corona, virus, farmer, trs, mro






