అందులో వాస్తవం లేదు : ఆళ్ల రామకృష్ణ

35

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా నది కరకట్టను ఆనుకుని నిర్మించిన చంద్రబాబు ఇంటిని ఏపీ ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేస్తుందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మాజీ సీఎంతో పాటు 60 మందికి ప్రతిసారీ నోటీసులు ఇస్తున్నామని గుర్తుచేశారు. రెండుసార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా కనీసం వారి నుంచి స్పందన కరువైందన్నారు.

వరదలు వచ్చినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని ఆయన చెప్పారు. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటికి కూడా నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు.