- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళగిరిలో కాబట్టి రాళ్లదాడి.. రాయలసీమలో అయితే ఖూనీలే
<p>దిశ, ఏపీ బ్యూరో: మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెండు రోజుల దీక్షలు చేపట్టారు. మైదుకూరులో చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో కాబట్టి పార్టీ కార్యాలయంపై రాళ్లు వేశారని, అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్ష పార్టీల ఆఫీసు, ఇళ్లపై దాడులు చేయడం సర్వసాధారణం.. దానిని ఎవరూ తప్పబట్టరు.. ఎందుకంటే […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెండు రోజుల దీక్షలు చేపట్టారు. మైదుకూరులో చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో కాబట్టి పార్టీ కార్యాలయంపై రాళ్లు వేశారని, అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్ష పార్టీల ఆఫీసు, ఇళ్లపై దాడులు చేయడం సర్వసాధారణం.. దానిని ఎవరూ తప్పబట్టరు.. ఎందుకంటే అటువంటి నీచమైన భాష మాట్లాడినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది.. ఆంధ్రాలో ఆఫీసులపైకి వెళ్లి రాళ్లవేశారు.. రాయలసీమైతే ఖూనీలు జరిగుండేవి’ అంటూ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
Next Story






