వలస కార్మికులకు బియ్యం పంపిణీ

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: లాక్‎డౌన్‎కు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వలస కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు [&hellip;]</p>

వలస కార్మికులకు బియ్యం పంపిణీ
X

దిశ, రంగారెడ్డి: లాక్‎డౌన్‎కు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వలస కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు అందజేశామన్నారు.

tag: MLA Prakash Goud, Distribution, rice, migrant workers, Shamshabad

Next Story