- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీపీసీసీని మార్చొద్దు: జగ్గారెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ పీసీసీని మార్చవద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. సోమవారం ఏఐసీసీ ఇన్‌చార్జీ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫిరాయింపుల పై పార్టీ పక్షాన న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఒకవేళ పీసీసీ మార్చవలసి వస్తే తనకు అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి బయోడేటా అందించారు. తనకు ఇవ్వకపోతే తాను చెప్పిన వారికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ పీసీసీని మార్చవద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. సోమవారం ఏఐసీసీ ఇన్‌చార్జీ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫిరాయింపుల పై పార్టీ పక్షాన న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఒకవేళ పీసీసీ మార్చవలసి వస్తే తనకు అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి బయోడేటా అందించారు. తనకు ఇవ్వకపోతే తాను చెప్పిన వారికి ఇవ్వాలని సూచించాడు. కాగా, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి రహస్యంగా మాణిక్యం ఠాకూర్‌తో భేటీ అయినట్టు సమాచారం.
Next Story






