- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆవుల దొంగలపై చర్యలు తీసుకోండి :జగ్గారెడ్డి
<p>దిశ, వెబ్‌డెస్క్: మూడు నెలల క్రితం తన ఆవులు దొంగలించబడ్డాయని.. ఇప్పటికీ వాటి అచూకీ లభ్యం కాలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులను దొంగలించే ముఠాను పట్టుకోవాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు. తాను నిత్యం పూజించే ఆవు కూడా దొంగిలించబడిందని అన్నారు. ఈ మేరకు ఆ ఆవుతో దిగిన ఫోటోను జగ్గారెడ్డి విడుదల చేశారు. అయితే తన ఆవులను దొంగలించడంతో.. ఇంట్లో దూడలు మాత్రమే మిగిలాయని అన్నారు. దీనిపై సంగారెడ్డి టౌన్ పోలీస్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మూడు నెలల క్రితం తన ఆవులు దొంగలించబడ్డాయని.. ఇప్పటికీ వాటి అచూకీ లభ్యం కాలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులను దొంగలించే ముఠాను పట్టుకోవాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు. తాను నిత్యం పూజించే ఆవు కూడా దొంగిలించబడిందని అన్నారు. ఈ మేరకు ఆ ఆవుతో దిగిన ఫోటోను జగ్గారెడ్డి విడుదల చేశారు. అయితే తన ఆవులను దొంగలించడంతో.. ఇంట్లో దూడలు మాత్రమే మిగిలాయని అన్నారు. దీనిపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా ఇచ్చానని.. పోలీసులు వెతుకుతున్నారని.. వారిని తప్పుబట్టడం లేదన్నారు.
కానీ, ఆవు దొంగతనం చేసిన వారిని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రేమతో పెంచుకున్న ఆరు ఆవులు దొంగిలించబడినా ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆవులను మేత కోసం వదిలితే దొంగలు కబేళాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. తన ఆరు ఆవులే కాదు సంగారెడ్డిలో చాలా ఆవులు, ఎడ్లు దొంగలించబడ్డాయన్నారు. ఇలాంటివి జరగకుండా చూడాలని పోలీస్ వ్యవస్థను డీజీపీని కోరుతున్నానని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు.






