టీఆర్ఎస్ నేతలకు చీము, నెత్తురు లేదా: జగ్గారెడ్డి

by  |
టీఆర్ఎస్ నేతలకు చీము, నెత్తురు లేదా: జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలి కాలంలో తరచూ సీఎం కేసీఆర్‌ని జైల్లో పెడుతా, ఆ కుటుంబం అవినీతిని బైటకు తీస్తా, తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని, ఆ మౌనం వెనక రహస్యం ఏంటి అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ అంతగా మాట్లాడుతున్నా టీఆర్ఎస్ నేతలు చీము నెత్తురు లేనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో, ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందమేంటో స్పష్టమవుతోందన్నారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలెవ్వరూ బండి సంజయ్ మాటలను ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవాలనే ఉద్దేశం టీఆర్ఎస్‌కు ఉన్నట్లయితే ప్రధాని వైఫల్యాలపై ఆ పార్టీని నిలదీయవచ్చన్నారు.

అధికారం లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతాం

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటుందన్నారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు ప్రజా సమస్యలను గాలికొదిలేశాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరేళ్లలో ఒక్క ప్రజా సమస్యనూ పరిష్కరించలేదన్నారు. రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఆసరా పింఛను వయసు అర్హతను 57 ఏళ్లకు కుదించడం, నిరుద్యోగ భృతి .. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఇందులో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక పెద్ద డైరీనే రాయాల్సి వస్తుందన్నారు.

ఆ మూడు పార్టీలో ఒకే తాను ముక్కలు

హిందుత్వ ఎజెండాతో, గుళ్లు గోపురాలు, దేవుళ్ళ పేరు చెప్పి ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, మజ్లిస్ పార్టీ, దానిని మిత్రపక్షంగా భావిస్తూ జోడీ కట్టిన టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, ఒక తానులోని వేర్వేరు ముక్కలని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత బండి సంజయ్ ప్రతీరోజు ఒకటే పాట పాడుతున్నారన్నారు. కేసీఆర్‌ను జైల్లో పెడతా అని చెప్పడమే తప్ప ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదో మాత్రం కారణం చెప్పడంలేదన్నారు.



Next Story

Most Viewed