- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మోదీ, కేసీఆర్ కరోనాను లైట్‌గా తీసుకున్నారు’
by Shyam |
<p>హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండు ప్రభుత్వాలు కరోనా వైరస్‌ను లైట్‌గా తీసుకున్నారని జగ్గారెడ్డి తప్పుబట్టారు. శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా కరోనా నియంత్రణపై పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించారు. దేశం శవాల దిబ్బగా మారకముందే మేల్కోవాలని హెచ్చరించారు. ప్రజలు మరణిస్తుంటే… ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చినా ఉపయోగం లేదని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని పెంచాలని, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో […]</p>

X
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండు ప్రభుత్వాలు కరోనా వైరస్‌ను లైట్‌గా తీసుకున్నారని జగ్గారెడ్డి తప్పుబట్టారు. శాస్త్రవేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా కరోనా నియంత్రణపై పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించారు. దేశం శవాల దిబ్బగా మారకముందే మేల్కోవాలని హెచ్చరించారు. ప్రజలు మరణిస్తుంటే… ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చినా ఉపయోగం లేదని చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని పెంచాలని, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. అన్ని జిల్లా ఆసుపత్రులకు నిధులు కేటాయించాలని, ప్రజారోగ్యానికే నిధులన్నీ ఖర్చుపెట్టి ప్రజల ప్రాణాలు రక్షించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Next Story






