నేను భూకబ్జాలు చేయలేదు… ఇది మంచి పద్దతి కాదు

by  |
నేను భూకబ్జాలు చేయలేదు… ఇది మంచి పద్దతి కాదు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని, నేను ఏ భూకబ్జాలకు పాల్పడలేదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తరపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నార్కట్ పల్లి మండలం మాండ్రా గ్రామంలో నా కొడుకు మనోజ్ పేరుమీద పది ఎకరాల 10 గుంటల భూమిని కొనుగోలు చేశానన్నారు. 296, 292 సర్వే నెంబర్‌లలో శ్రీశైలం అనే వ్యక్తి దగ్గర భూమి కొనుగోలు చేశారని తెలిపారు.

కానీ రెండు నెలలుగా కావాలని కొంతమంది వక్ర బుద్ధితో, దుష్ప్రచారం చేస్తున్నారని, బురద జల్లుతున్నారని వివరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం వద్ద తనకు చెడ్డ పేరు వచ్చే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రౌడీయిజం చేసి, అధికారం దుర్వినియోగం చేసి, బలవంతంగా భూమిని లాక్కున్నానని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా దెబ్బ తీసే విధంగా, చెడ్డ పేరు వచ్చేలాగా ప్రత్యర్ధులు కుట్ర చేస్తున్నారని, భూదందాలకు పాల్పడుతున్నానని నిన్న రాజ్ న్యూస్ ఛానల్‌లో, సోషల్ మీడియాలో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు.

ఇది మంచి పద్ధతి కాదని, పదవులు ముఖ్యం కాదని, తాను ఏ తప్పు చేయనని, నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యమని, ప్రజల కోసమే కృషి చేస్తానని చెప్పారు. గెలుపు ఓటములు చూసా.. పోలీసులను సొంతానికి వాడుకోవడం నాకు మొదటి నుంచి అలవాటు లేదని, పార్టీ మారినప్పటి నుంచి నన్ను టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. కుట్రలన్నీ చట్టపరంగా ఎదుర్కొంటానని, నీతి నిజాయితీగా పోరాడుతానని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed