- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి
<p>దిశ, అచ్చంపేట: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సందర్భంలో నియోజకవర్గంలోని అధికారులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని చారకొండ మండల ఎంపీడీవో, ఎంపీపీ, జెడ్పీటీసీ, పోలీస్ శాఖ, ముఖ్యంగా వైద్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మండలంలో కరోనా కేసులు నివారణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఏ గ్రామాల్లో ఎన్ని పాజిటివ్ కేసులు […]</p>

దిశ, అచ్చంపేట: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సందర్భంలో నియోజకవర్గంలోని అధికారులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు.
నియోజకవర్గంలోని చారకొండ మండల ఎంపీడీవో, ఎంపీపీ, జెడ్పీటీసీ, పోలీస్ శాఖ, ముఖ్యంగా వైద్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో మండలంలో కరోనా కేసులు నివారణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఏ గ్రామాల్లో ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివరాలు తెలుసుకున్నారు.
అలాగే సామాజిక దూరం వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం మరిచిపోకుండా పాటించాలన్నారు. అలాగే మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తూ పనులు వేగవంతంగా కొనసాగేలా చూడాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






