- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మియాందాద్ ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీనా !
<p>టీమ్ ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో.. ఆఫ్ ఫీల్డ్‌లో అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే అతడికి సామాన్యులే కాక సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతుంటారు. తాజాగా కోహ్లీ ఫ్యాన్స్ లిస్టులో పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ మియాందాద్ కూడా చేరాడు. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీయే తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ […]</p>

టీమ్ ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కోహ్లీ ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో.. ఆఫ్ ఫీల్డ్‌లో అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే అతడికి సామాన్యులే కాక సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతుంటారు. తాజాగా కోహ్లీ ఫ్యాన్స్ లిస్టులో పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ మియాందాద్ కూడా చేరాడు.
ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీయే తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను షేర్ చేశాడు. ‘నన్ను ఎవరైనా టీమ్ ఇండియాలో మీకు ఎవరంటే ఇష్టమని అడిగితే.. నేను తడుముకోకుండా విరాట్ కోహ్లీ పేరే చెప్తా’ అని మియాందాద్ సదరు వీడియోలో తెలిపాడు. ప్రపంచంలోని అన్ని రకాల పిచ్‌లపై ఆడిన విరాట్ గణాంకాలే అతడు ఎంత గొప్ప బ్యాట్స్‌మన్ అనే విషయాన్ని చెబుతాయని వెల్లడించాడు. కోహ్లీ సౌతాఫ్రికాలో ఆడిన విధానం తనను ఎంతో ఆకట్టుకుందని, అతడు ఏ ఫాస్ట్ బౌలర్‌కు కూడా భయపడడంటూ ప్రశంసలు కురిపించాడు.
Tags : Pakistan, Miandad, Virat Kohli, Legendary cricketer






