- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ఇలాఖాలో దారుణం.. కామంతో కళ్లు మూసుకుపోయిన సర్పంచ్ భర్త ఏం చేశాడంటే..?
<p>దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన సర్పంచ్ భర్త ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం శుక్రవారం వెలుగుచూసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా, అతనిపై పోక్సో్ పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకివెళితే.. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళా ఏఎన్ఎం కుటుంబం వృత్తి రీత్యా అల్మాస్పూర్లోని సర్పంచ్ భర్త అయిన రైతుబంధు సమితి […]</p>

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన సర్పంచ్ భర్త ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం శుక్రవారం వెలుగుచూసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా, అతనిపై పోక్సో్ పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకివెళితే.. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళా ఏఎన్ఎం కుటుంబం వృత్తి రీత్యా అల్మాస్పూర్లోని సర్పంచ్ భర్త అయిన రైతుబంధు సమితి అధ్యక్షుడు రాధారపు శంకర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
అయితే, ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న మహిళా దంపతులకు ఏడేళ్ళ చిన్నారి ఉంది. ఈ క్రమంలోనే సర్పంచ్ భర్త రాధారపు శంకర్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని తమ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతగా ఉండటాన్ని గమనించిన తల్లి ఏమైందని అడగగా బాధిత చిన్నారి అసలు విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, గ్రామస్థులతో పాటు, గిరిజన సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. అల్మాస్పూర్లోని శంకర్ ఇంటిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ధర్నా చేపట్టారు.






