కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు : మంత్రి

46

దిశ, వెబ్‌డెస్క్: ప్లాట్లు ఉన్న పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా, ఎక్కడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని వెల్లడించారు.