ఇదంతా అవసరమా మోహన్ బాబు.. మా ఎన్నికలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

by  |

దిశ, వెబ్‌డెస్క్ : మా ఎన్నికల్లో గెలుపొందిన మంచు విష్ణు ప్రమాణస్వీకారానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కళాకారుల వేదిక.. ఇక్కడ రాజకీయాలొద్దు.. మా ఎన్నికల్లో చాలా రాజకీయాలు జరిగాయి, ఇదంతా అవసరమా మోహన్ బాబు అంటూ మంత్రి కామెంట్స్ చేశారు. మా అనేది చిన్న వ్యవస్థ కాదని, 900 మంది కుటుంబాల భవిష్యత్తును.. ఓ యువకుడు నడిపించాలంటూ పేర్కొన్నారు. విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ సినీ హబ్‌గా ఉండాలని, సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. అంతే కాకుండా సింగిల్ విండో ద్వారా అన్ని రకాల అనుమతులు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను, పరిచయం చేశామని, పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. ఇక మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఆయనతో పాటు తన ప్యానెల్ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అయితే మంచు ప్రమాణ స్వీకారానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు గైర్హాజరయ్యారు.

Next Story