- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి పేదవాడికి సొంతిళ్లు: తలసాని
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: పేద ప్రజలకు అన్నిరకాల వసతులతో కూడిన సొంతిళ్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ పరిధిలోని భోజగుట్టలో రూ.127 కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై మేయర్ బొంతు రాంమోహన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ7.75 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ […]</p>

X
దిశ, హైదరాబాద్: పేద ప్రజలకు అన్నిరకాల వసతులతో కూడిన సొంతిళ్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ పరిధిలోని భోజగుట్టలో రూ.127 కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై మేయర్ బొంతు రాంమోహన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ7.75 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. భోజగుట్టలో 1,824 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే 300 ఇళ్ల నిర్మాణ పనులు 70 శాతంపైగా పూర్తయినట్లు వివరించారు. సమావేశంలో కార్పొరేటర్లు బంగారు ప్రకాష్, మిత్ర కృష్ణ, హౌసింగ్ సీఈ సురేష్, ఎస్ఈ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






