- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి యుద్ధానికి సిద్ధం కండి.. మంత్రి పిలుపు
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కృష్ణా, తుంగభద్ర నదులలో మన నీటి వాటా మనకు దక్కకుండా చేస్తున్న వారిపై అవసరమైతే యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి అని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం భూత్పూర్ మండలం తాటిపర్తి, కరివెన గ్రామాలలో రైతు వేదిక ప్రారంభోత్సవం, పల్లె ప్రగతి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు దేవుళ్ళు, ఆ రైతులు […]</p>

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కృష్ణా, తుంగభద్ర నదులలో మన నీటి వాటా మనకు దక్కకుండా చేస్తున్న వారిపై అవసరమైతే యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి అని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం భూత్పూర్ మండలం తాటిపర్తి, కరివెన గ్రామాలలో రైతు వేదిక ప్రారంభోత్సవం, పల్లె ప్రగతి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు దేవుళ్ళు, ఆ రైతులు బాగుంటేనే మనమదరం బాగుంటాం, లేకుంటే మన బతుకులు అగమ్యగోచరంగా మారుతాయని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలు అందజేస్తూ దళితులకు అండగా నిలుస్తున్నారు అన్నారు. ప్రజల ఆశలు ఆశయాల మేరకు ప్రతి పల్లె పట్టణం అన్న తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

అలాగే కృష్ణ, తుంగభద్ర వంటి నదులలో మన నీటి వాటాను సాధించుకునేందుకు పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు. మన నీటిని మనం దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న నీళ్లను కూడా దూకుడు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలిపారు. ఆ కుటుంబాన్ని అధిగమించేందుకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఆంధ్ర ప్రభుత్వం పై పోరుకు సిద్ధం కావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో పోరాటాన్ని ఉధృతం చేయవలసి వస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన వాటాను సాధించుకుందామని మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కరివెన ప్రాజెక్టును పర్యాటక స్థలంగా రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, భూత్పూర్ ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






