- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పని చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమే: మంత్రి సింగిరెడ్డి
by Shyam |
<p>దిశ, నాగర్‌కర్నూల్: రైతులకు నిరంతరం.. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్-పాన్‌గల్ మండలాల పరిధిలోని దొండాయిపల్లి, కేతేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. […]</p>

X
దిశ, నాగర్‌కర్నూల్: రైతులకు నిరంతరం.. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్-పాన్‌గల్ మండలాల పరిధిలోని దొండాయిపల్లి, కేతేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. ఒక రైతు బిడ్డ, రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






