- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్ : నారా లోకేష్
<p>దిశ, వెబ్‌డెస్క్ : కిల్లర్ వీరప్పన్ ఎర్రచందనం చెట్లను నరికేసినట్లే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పెద్దిరెడ్డి పంగనూరు వీరప్పన్ అని ఘాటు విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బయటి నుంచి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. 5 వేల మంది పెద్దిరెడ్డి కళ్యాణ మండపంలో మకాం వేసి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. తిరుపతి […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కిల్లర్ వీరప్పన్ ఎర్రచందనం చెట్లను నరికేసినట్లే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పెద్దిరెడ్డి పంగనూరు వీరప్పన్ అని ఘాటు విమర్శలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బయటి నుంచి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. 5 వేల మంది పెద్దిరెడ్డి కళ్యాణ మండపంలో మకాం వేసి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు.
తిరుపతి ఉపఎన్నికలో రిగ్గింగ్, దొంగ ఓట్లతో నెగ్గాలని వేసిన ప్రణాళికని తెలుగుదేశం బట్టబయలు చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలని, దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో కాదు.. పోరాడి గెలవాలని పెద్దిరెడ్డికి హితవు పలికారు లోకేష్.






