- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11 ఏళ్ల తర్వాత అలుగుపారుతోంది: మంత్రి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తాళ్ల చెరువులో ఉన్న ఆక్రమణలను తొలగించి మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరి అలుగు పారుతున్న వనపర్తి తాళ్లచెరువుకు ఆయన సోమవారం పూజలు చేశారు. అనంతరం పట్టణంలోని 22వ వార్డులో పర్యటించి కంపచెట్లను తొలగించాలని ఆదేశించారు. గతంలో తీసుకున్న చర్యల మూలంగా 11 ఏళ్ల తరువాత చెరువు అలుగుపారిందన్నారు. గత రెండేళ్లుగా […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తాళ్ల చెరువులో ఉన్న ఆక్రమణలను తొలగించి మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరి అలుగు పారుతున్న వనపర్తి తాళ్లచెరువుకు ఆయన సోమవారం పూజలు చేశారు. అనంతరం పట్టణంలోని 22వ వార్డులో పర్యటించి కంపచెట్లను తొలగించాలని ఆదేశించారు. గతంలో తీసుకున్న చర్యల మూలంగా 11 ఏళ్ల తరువాత చెరువు అలుగుపారిందన్నారు. గత రెండేళ్లుగా నల్లచెరువు, ఈదుల చెరువు కృష్ణమ్మ నీళ్లతో అలుగులు పారుతున్నాయన్నారు. ఈ ఏడాది కృష్ణనీళ్లకు తోడు వర్షాలు కురవడంతో చెరువులు అలుగులు పారుతున్నాయన్నారు. అలాగే త్వరలో తాళ్లచెరువు చుట్టూ ప్రహరి నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Next Story






